Thursday, 5 November 2026

హరిప్రియ కప్ సీజన్-2 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రధానం

హరిప్రియ కప్ సీజన్-2 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రధానం
* టేకులపల్లి లో మినీ స్టేడియం కు కృషి చేస్తా
* ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ

టేకులపల్లి, జనవరి 16( జనం సాక్షి): హరిప్రియ కప్ సీజన్- 2 క్రికెట్ టోర్నమెంట్ నూతన సంవత్సరంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వాహకులు జాటోత్ నరేష్ నాయక్, ప్రవీణ్, సందీప్,వినోద్, హేమంత్, అనిల్ ఆర్మీ, రాజేష్, కళ్యాణ్, గణేష్, శశి తదితరులు టేకులపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసి 40 టీములు క్రికెట్ మ్యాచ్ లో పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ రోజున ఫైనల్ కి చేరుకున్న వెంకటియా తండా వర్సెస్ కోయగూడెం క్రికెట్ మ్యాచ్ లో తలపడ్డాయి. ఈ ఫైనల్ మ్యాచ్లో విన్నర్ గా విజయం సాధించింది. ఆదివారం సాయంత్రం బహుమతుల ప్రధానం జరగగా ముఖ్యఅతిథిగా ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ పాల్గొని వారి చేతులు మీదుగా బహుమతులను అందించారు. విన్నర్ గా విజయం సాధించిన వెంకటియా తండా క్రికెట్ టీంకు 50 వేల నగదు తో పాటు కప్పును అందజేశారు. రన్నర్ గా నిలిచిన కోయగూడెం క్రికెట్ టీంకు 30 వేల నగదు తో పాటు కప్పును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత క్రీడల పట్ల ఆసక్తి చూపిస్తూ రాణించాలని కోరారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో మట్టిలోన ఆణిముత్యాలు లాంటి ఎందరో క్రీడాకారులు ఉన్నారని అన్నారు. రానున్న హరిప్రియ కప్ సీజన్ -3 నాటికి టేకులపల్లి లో మినీ స్టేడియం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని క్రీడాకారులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై భూక్య శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు బానోతు రామానాయక్, బానోత్ కిషన్ నాయక్, జాటోత్ నరేష్ నాయక్, లక్కినేని శ్యామ్ , వైస్ ఎంపీపీ ఉండేటి ప్రసాద్,ఎంపీటీసీ భూక్య బాలకృష్ణ, బోడ రమేష్ నాయక్,బొడ్డుపల్లి బ్రహ్మచారి, నోముల భానుచందర్,టేకులపల్లి మండల కేంద్రంలోని యువకులు, వ