Wednesday, 4 November 2026

అక్రమంగా పాతిన కరెంటు స్తంభాలను వెంటనే తొలగించాలి

అక్రమంగా పాతిన కరెంటు స్తంభాలను వెంటనే తొలగించాలి
దోమ జనవరి 4(జనం సాక్షి)
దోమ మండల పరిధిలోని,రాకొండ గ్రామానికి చెందిన దళిత కులానికి చెందిన బండి శ్రీనివాస్ పొలంలో దోమ ఎలక్ట్రిసిటీ ఏఈ,కాంట్రాక్టర్ కుమ్మకై భూమిని యాజ్యమాని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఉద్దేశ్యపూర్వకంగా వారిని ఆర్థింకంగా నష్టపరిచిన దోమ ఎలక్ట్రిసిటీ ఏఈ ని సస్పెండ్ చెయ్యాలని నేడు దోమ సబ్ స్టేషన్ ముందు వ్యవసాయ కార్మిక సంఘం, LHPS, బహుజన సేన, సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చెయ్యడం జరిగింది.
ఈ సందర్బంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటయ్య, LHPS రాష్ట్ర కార్యదరి గోవింద్ నాయక్, బహుజన సేన నాయకులు అంజి రావణ్ మాట్లాడుతూ… రాకొండ గ్రామానికి చెందిన దళితులు బండి నర్సిములు పంటపోలంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఎలక్ట్రికల్ ఏఈ కాంట్రాక్టర్ ఇద్దరు కుమ్మక్కయి దళితులను ఆర్థికంగా నష్టపరిచిన వారిపై కర్ణ చర్యలు తీసుకోవాలని వాళ్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా దళితుల పొలంలో అక్రమంగా పాతిన కరెంటు స్తంభాలను వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు లేనియెడల పెద్ద ఎత్తున ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేస్తామని ప్రభుత్వాన్ని అధికారులని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు హెచ్.సత్యయ్య,రఘురాం, సిహెచ్ సత్తయ్య, శేఖర్ శ్రీనివాస్ వెంకటయ్య,రాములు, తదితరులు పాల్గొన్నారు.