బాల్కొండ ఫిబ్రవరి 5 (జనం సాక్షి ) నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఏం.ఈ. ఓ ను సస్పెండ్ చేయాలని రాష్ట్ర డి.టి. యఫ్ ఉపాధ్యక్షులు పి. శాంతన్ డిమాండ్ చేసారు.మండల విద్యాశాఖ అధికారిగా కొనసాగుతున్న బి. రాజేశ్వర్
మండలంలోని ఉపాధ్యాయుల వద్ద నుండి అక్రమ వసూళ్లు చేస్తున్నారని,పాఠశాల విద్య, అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన మండల విద్యాశాఖ అధికారి బి. రాజేశ్వర్ (బాల్కొండ, మెండోరా, ముప్కాల్) ను సస్పెండ్ చేసి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి తగు చర్యలు తీసుకావాలని పి.శాంతన్ శనివారం పత్రికలకు విడుదల చేసిన కరపత్రంలో డిమాండ్ చేశారు.ఇది ఇలా ఉండగా తేదీ 01/02/2023 న దినపత్రికలలో వచ్చిన కథనo ఆధారంగా డిటిఫ్ విచారణ, గతంలో ఏం.ఈ. ఓ పై అవినీతి అక్రమాలు, అధికార దుర్వినియోగం పై గతంలో డిటిఎఫ్ పక్షాన పలు సందర్బలలో జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని బాల్కొండఏం.ఈ.ఓ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి నియమ నిబంధనలను విస్మరించడం,ఉపాధ్యాయుల పట్ల బ్లాక్ మెయిలింగ్ తో పాటు ఇష్ట రాజ్యాంగ విధుల నిర్వహణ చేయడంలో ఆయనకు ఆయనే సాటి అనిమెండోరా మండలంలో నిర్మించిన ఎమ్మార్సీ భవన ప్రారంభోత్సవానికి ఇతరత్ర ఖర్చుల పేరిట పెద్ద ఎత్తున నిధుల సేకరణకు శ్రీకారం చుట్టడం,ఉపాధ్యాయుల నుండి వెయ్యి నుండి ఐదు వేల రూపాయల వరకు అక్రమంగా వసూలు చేయడం, ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల వద్ద, కోచింగ్ సెంటర్ల యాజమాన్యం వద్ద, గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల వద్ద పెద్ద ఎత్తున నిధులు సేకరించడం జరిగిందని ఆయన ఆరోపించారు.ఇట్టి నిధులు సేకరించడానికి పాఠశాల విధులలో ఉన్న ఒకరిద్దరు ఉపాధ్యాయులను వాడుకోవడం అధికార దుర్వినియోగమే అవుతుంది. ప్రభుత్వ కార్యాలయాల ప్రారంభోత్సవానికి ప్రభుత్వమే కావాల్సిన నిధులను విడుదల చేస్తుంది. ఆవకాశం దొరికితే చాలు నిధులు సేకరించడం నోక్కేయడం విధి నిర్వహణలో ఎంఈఓ కు పరిపాటిగా మారింది. 2020 ఏప్రిల్, మే నెలలో కరోనా సందర్భంగా వలస కార్మికులకు భోజనం, ఏర్పాటు చేయాలని మండలంలోనిఉపాధ్యాయులుముందుకు వచ్చి సామాజిక బాధ్యతగా గుర్తించి విరాళాలు సేకరించి సదరు ఎంఈఓ దగ్గర నిధులను ఉంచితే అట్టినిధులకు లెక్కలు ఇవ్వకుండా కాజేసినా వైనం ఉపాధ్యాయులందరికీ తెలుసని, గతంలో జెడ్.పి హెచ్.ఎస్ ముప్కాల్ లో పని చేసినప్పుడు పాఠశాల స్వర్ణోత్సవాల పేరిట లక్షలాది రూపాయలు విరాళాలుగా కలెక్ట చేసి లెక్కలు చూపకుండా కాజేసిన విషయమై గ్రామ యువత నిలదీసిన సందర్భంతో పాటు ఫేక్ బిల్లులతో పాఠశాల గ్రాంట్ల దుర్వినియోగం ఆరోపణలు ఉన్నాయని.ప్రభుత్వ పాఠశాల డైరెక్టర్ ఉన్నత స్థాయి అధికారుల ద్వారా విచారణ చేస్తే బాల్కొండ ఏం.ఈ. ఓ బట్టు రాజేశ్వర్ అవినీతి బయటికి వస్తాయని ఆయన విద్యాశాఖ డైరెక్టర్ ను కోరారు. ప్రస్తుతo పని చేస్తున్న జడ్పిహెచ్ఎస్ చిట్టాపూర్ ఉన్నత పాఠశాలలో కూడా ఫేక్ బిల్లులతో నిధులు కాజేసిన వైనం విచారణలో తేలుతుంది. 2017 సంవత్సరంలో ఉపాధ్యాయుల ట్రైనింగ్ సంబంధించి మంజూరైన టిఎ,డిఎ లను ఉపాధ్యాయులకు చెల్లించకుండా నొక్కేయడం జరిగింది. బాల్కొండ ప్రైమరీ స్కూలుకు చెందిన ఒక ఉపాధ్యాయుడు 20 రోజుల సెలవు కోరుతూ గత సంవత్సరం ఏప్రిల్ మొదటి వారంలో ఇచ్చిన విజ్ఞప్తి పత్రాన్ని మాయం చేసి సదురు ఉపాధ్యాయుడు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు అయినట్టు జిల్లా విద్యాశాఖకు తప్పుడు నివేదిక పంపి ఉపాధ్యాయుని సస్పెన్షన్కు ఎంఈఓ కారణమైనాడు. సెలవు మంజూరుకి అడిగిన డబ్బులు ఇవ్వలేదని పైగా “సెల్ఫోన్ సంభాషణను వాట్సాప్ లో వైరల్ చేశాడని,” తనపై ఉన్నతాధికారులకు లంచం డిమాండ్ చేసినట్టు ఫిర్యాదు చేశాడని కోపంతో తప్పుడు నివేదికతో సదరు ఉపాధ్యాయున్ని విధులలోనికి తీసుకోకుండా ఏంఈవో అడ్డుపడ్డాడు. ఫలితంగా పది నెలలుగా సస్పెన్షన్ లో సదరు ఉపాధ్యాయుడు కొనసాగుతున్నాడు. జిల్లాలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న ఉపాధ్యాయులు కూడా సస్పెన్షన్ అయిన నెలలోపు విధులలోనికి తీసుకోబడ్డారు కేవలం గైర్హాజరు కారణం పై పది నెలలుగా ఉపాధ్యాయుడు సస్పెన్షన్ లోనే ఉన్నాడు.ఉపాధ్యాయుని సస్పెన్షన్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపితే ఎంఈఓ, జిల్లా విద్యాశాఖ కుట్రపూరిత వైఖరి బహిర్గతo అవుతుంది.అలాగే 2022 మార్చ్ పదవ తరగతి పరీక్షల నిర్వహణ అధికారుల నియామకాల్లో జూనియర్ స్కూల్ అసిస్టెంట్లకు బాధ్యతలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ గతంలో “డి.టి.ఎఫ్ జిల్లా అధికారికి ఫిర్యాదుకు ఏం.ఈ. ఓ . పొంతన లేని వివరణ ఇచ్చిన సందర్భం ఉందని సదరు ఎంఈఓ పై చర్యలకు పరీక్షల విభాగం కమిషనర్ కు నివేదిక కూడా వెళ్లిందని.ప్రతి సంవత్సరo 10వ తరగతి ఇన్విజిలేటర్ల నియామకాల్లో నిబంధనలు తుంగలో తొక్కిన విషయాలు అక్రమాలు విచారణలో తేలుతుందినీ. పాఠశాల ప్రార్థనకు హాజరు కాని ఉపాధ్యాయుల వివరాలు సేకరించి డబ్బులు డిమాండ్ చేయడం లేదంటే జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేస్తానని బెదిరింపులకు పాల్పడి బ్లాక్ మెయిల్ చేయడం సదరు ఎంఈఓ కు నిత్యకృత్యాలు అనేకం ఉన్నాయని శంతన్ వివరించారు. మెండోరా మండలంలో నిర్మించిన ఎమ్మార్సీ భవనానికి నిధుల సేకరణ విషయంలో కమిటీ వేసి నిధులు వసూలు చేశారని, ఇటీవలే ఆ కమిటీని రద్దు చేస్తూ ఎంఈఓ తీర్మానం చేయడం జరిగిందని ఉపాధ్యాయుల నుండి తీసుకున్న డబ్బులను తిరిగి ఉపాధ్యాయులకు ఇవ్వడం వెనుక అసలు కారణం జిల్లా విద్య శాఖ అధికారులే తెలిపాలని రాష్ట్ర డి టి ఎఫ్ ఉపాధ్యక్షులు పి శాంతన్ తెలిపారు. బాల్కొండ ఏం.ఈ. ఓ పై జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి అవినీతి, అక్రమాలు అధికార దుర్వినియోగానికి పాల్పడిన బాల్కొండ ఎంఈఓ బి.రాజేశ్వర్ ను తక్షణమే సస్పెండ్ చేసి సమగ్ర విచారణ జరిపి తగు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా ఏం. బాలయ్య జిల్లా అధ్యక్షులు ఆర్. రాజన్న జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేస్తున్నారు




