బాల్కొండ ఫిబ్రవరి 5 (జనం సాక్షి )బాల్కొండ లో వి పి ఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ గ్రాండ్ ఫైనల్ ఆదివారం తల్వార్ బ్రదర్స్ బాల్కొండ వర్సెస్ ఉమ్రీ మహారాష్ట్ర జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో ఉమ్రి మహారాష్ట్ర జట్టు గెలుపొందారు. గెలుపొందిన జట్లకు ముఖ్య అతిథిలుగా పాల్గొన్న డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, బాల్కొండ ఎంపీపీ లావణ్య లింగాగౌడ్, బాల్కొండ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి, ముప్కాల్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ముస్కు భూమేశ్వర్ రెడ్డి, బాల్కొండ సర్పంచ్ బూస సునీత నరహరి, బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు సయ్యద్ సలావుద్దీన్ చేతులమీదుగా విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు. వి పి ఆర్ క్రికెట్ టోర్నమెంట్ గత 16 రోజులుగా కొనసాగించడం జరిగిందని ఇందులో 28 టీంలు పాల్గొన్నారు ఈ టోర్నమెంట్లో గెలుపొందిన మొదటి బహుమతి ఉమ్రి మహారాష్ట్ర జట్టుకు 60 వేల రూపాయలు ట్రోఫీ కప్ ,రెండవ బహుమతి తల్వార్ బ్రదర్స్ బాల్కొండ 30 వేల రూపాయలు ట్రోఫీ కప్ ఇవ్వడం జరిగిందని టోర్నమెంట్ నిర్వాహకులు ఎంఏ షాహిద్, మామిడి రాకేష్, అన్వర్ లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బాల్కొండ ఉప సర్పంచ్ షేక్. వాహబ్ ,మండల కో ఆప్షన్ మెంబర్ సయ్యద్ ఫయాజ్ అలీ,సింగిల్ విండో చైర్మన్ సూరజ్ రెడ్డి, కపిల్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సయ్యద్ మజారుద్దీన్, టిఆర్ఎస్ నాయకులు ఆకుల నరేందర్, మానేటి నాగభూషణం , తౌట్ గంగాధర్, రామ్ రాజ్ గౌడ్, కన్న పోశెట్టి ,గాండ్ల రాజేష్, ఇంతియాజ్ ,ప్రసాద్ గౌడ్, గడ్డం రవి, గోవర్ధన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




