Tuesday, 3 November 2026

అక్రమాలపై వాటర్‌బోర్డు క్రిమినల్‌ యాక్షన్‌

హైదరాబాద్‌ సిటీ : ఓ వైపు నల్లాల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తూనే.. మరో వైపు అక్రమార్కులపై చర్యలకు శ్రీకారం చుట్టింది వాటర్‌బోర్డు. అనుమతి లేకుండా నల్లా కనెక్షన్‌ తీసుకున్న వారిపై చట్టపరంగా క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తున్నారు అధికారులు. తాజాగా గురువారం బహదూర్‌పురా సెక్షన్‌ పరిధిలోని మెమన్‌ కాలనీలో (ఇంటి నెంబర్‌ – 19-04-274 /8/3) ఉండే మహ్మద్‌ అష్రఫ్‌పై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్‌ 269, 430 ప్రకారం ఆయనపై క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నేరం రుజువైతే అతనికి ఐదేళ్ల జైలు శిక్ష పడుతుందన్నారు. అక్రమ నల్లా కనెక్షన్‌ ఉన్న వారు వెంటనే క్రమబద్ధీకరించుకోవాలని, లేకుంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని బోర్డు అధికారులు చెబుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *