హైదరాబాద్ సిటీ: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంఏలో కొత్తగా మాస్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్‌ను ప్రవేశపెటా ్టరు. ఈ కోర్సును ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించనున్నారు. అర్హులైన వా రు అక్టోబరు 8లోగా దరఖాస్తు చేసుకోవాలని పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండి యా, హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ జే.చెన్నయ్య తెలిపారు. కోర్సులో మొదటి సంవత్స రం థియరీ అండ్ ప్రిన్సిపిల్స్ ఆఫ్ కమ్యూనికేషన్, జర్నలిజం అండ్ పబ్లిక్ రిలేషన్స్, ఇంట్రడక్షన్ టు మాస్ మీడియా అండ్ గ్లోబల్ కమ్యూనికేషన్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ న్యూ మీడియా, కమ్యూనికేషన్ రీసెర్చ్, రైటింగ్, రిపోర్టింగ్ అండ్ ఎడిటింగ్ ఫర్ మాస్ మీడియా సబ్జెక్టులు ఉంటాయి. ఇంగ్లిష్ మీడియంలో ప్రవేశపెడుతున్న దీనికి ఏదేని డిగ్రీ కోర్సు చేసినవారు అర్హులు. యూనివర్సిటీ వెబ్‌సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఆర్‌ఏఓయూ.ఏసీ.ఇన్.లో ప్రాస్పెక్టస్‌ను పొందవచ్చు. ఈకోర్సు పూర్తి చేసిన వారికి భవిష్యత్తులో అవకాశాలు మెరుగ్గా ఉంటాయని చెన్నయ్య తెలిపారు.




