.అక్రమ అరెస్టులతో కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ఆపలేరు… గోపాల్ పేట్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
గోపాల్ పేట్ జనం సాక్షి జనవరి (2): టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సర్పంచుల హక్కులు – గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించాలని గ్రామపంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయాలని ఇందిరాపార్క్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మహా ధర్నా కార్యక్రమాన్ని వెళ్తున్న గోపాల్ పేట్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టు చేసి గోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ తప్పిదాలను ఎక్కడ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తోందన్న భయంతోనే పోలీసుల ద్వారా అక్రమ అరెస్టుల చేయించి ధర్నా కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కి,పాలన కొనసాగించుకోవాలనుకోవడం సరైంది కాదని తెలిపారు. సర్పంచులకు – గ్రామ పంచాయతీలకు నిధులను కేటాయించకుండా వారి నిధులను స్వాహా చేయడమే కాకుండా, వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం వల్ల ఈ మధ్యకాలంలో పలువురు సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు అని వారి ఆత్మహత్యలు చూసి చలించకుండా, వారి బాగోగులు పట్టించుకోకుండా గ్రామపంచాయతీ వ్యవస్థను పూర్తిగా బిఆర్ఎస్ పార్టీ నిర్వీర్యం చేసిందన్నారు. సర్పంచుల ఆవేదన చూసి చలించి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం లాగా గ్రామపంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయాలని, సర్పంచులకు చేసిన పనులకు బిల్లులు వెంటనే చెల్లించాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపడితే,ధర్నా కార్యక్రమాన్ని వెళ్తున్న కాంగ్రెస్ నాయకుల ను అడ్డుకోవడం మూర్ఖత్వమని గోపాల్ పేట్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని మండల నాయకులు తెలియజేశారు. సర్పంచులు ఎవరు అధైర్య పడవద్దు అని వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వారు అన్నారు ఈ ముందస్తు అరెస్టులో గోపాల్ పేట్ మండల ఉపాధ్యక్షులు సుధాకర్ రావు,వనపర్తి అసెంబ్లీ యూత్ ఉపాధ్యక్షులు కొంకి రమేష్, గోపాల్ పేట్ టౌన్ యూత్ అధ్యక్షులు ఎండి బాల పిరు, వార్డు సభ్యుడు వెంకటయ్య, కాంగ్రెస్ నాయకులు పూసల లక్ష్మణ్, ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.




