Tuesday, 3 November 2026

అక్రమ అరెస్టులతో కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ఆపలేరు

అక్రమ అరెస్టులతో కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ఆపలేరు

వీణవంక జనవరి 2( జనం సాక్షి) వీణవంక మండల కాంగ్రెస్ నాయకులు
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సర్పంచుల హక్కులు – గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించాలని గ్రామపంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయాలని ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మహా ధర్నా కార్యక్రమానికి బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ మండల కార్యనిర్వాహక అధ్యక్షుల ఎండి సాహెబ్ హుస్సేన్ తోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉదయమే క నాయకుల ఇండ్లలో పోయి అరెస్టు చేసి వారికి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తప్పిదాలను ఎక్కడ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తోందన్న కారణంతో పోలీసుల ద్వారా అక్రమ అరెస్టుల చేయించి ధర్నా కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకుంటుందని అన్నారు. సర్పంచులకు – గ్రామ పంచాయతీలకు నిధులను కేటాయించకుండా వారి నిధులను వెనుక తీసుకోవడం కాకుండా, వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం వల్ల ఈ మధ్యకాలంలో పలువురు సర్పంచులు ఇబ్బందులకు గురవుతున్నారు . వారి , బాగోగులు పట్టించుకోకుండా గ్రామపంచాయతీ వ్యవస్థను పూర్తిగా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. సర్పంచుల ఆవేదన చూసి చలించి…గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం లాగా గ్రామపంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయాలని, సర్పంచులకు చేసిన పనులకు బిల్లులు వెంటనే చెల్లించాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపడితే, ధర్నా కార్యక్రమానికి వెళ్తున్న మమల్ని అడ్డుకోని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారన్నారు. ఎలాంటి మూర్ఖత్వ పనులతో అక్రమ అరెస్టులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడేది లేదని వారు పేర్కొన్నారు. సర్పంచులు ఎవరు అధైర్య పడవద్దు అని వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. రైతులకు ఇచ్చిన రుణమాఫీ ఆమె నేటికీ నెరవేర్చకపోవడం ఎంతవరకు సమంజసం అని వారన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగాడి రాజిరెడ్డి. చదువు జైపాల్ రెడ్డి. వడ్డేపల్లి కొమురయ్య. జున్ను తుల మధుకర్ రెడ్డి. అడిగొప్పుల వెంకన్న. మోహన్ రెడ్డి. శంకరయ్య. గుంపుల గట్టయ్య. చీర బుజ్జయ్య. పైడి కుమార్.తో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు