తిరుపతి బస్సును ప్రారంభించిన నర్సంపేట డీఎం విజయమాధురి
జనం సాక్షి నర్సంపేట
ఇటీవలే నర్సంపేట నుండి సిద్దిపేట జిల్లా కేంద్రానికి నూతన ఆర్టీసీ బస్సు సర్వీస్ ను ప్రారంభించిన డిపో మేనేజర్ విజయమాధురి సోమవారం తిరుపతి వరకు వెళ్ళే మరో నూతన సర్వీస్ బస్సును ప్రారంభించారు.
సూపర్ లగ్జరీ TS 03Z 0315 నెంబర్ గల బస్సును ముఖ్య అతిథిగా పాల్గొన్న కౌన్సిలర్ నాగిశెట్టి పద్మప్రసాద్ తో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
డీఎం విజయమాధురి మాట్లాడుతూ….ప్రతి రోజు మధ్యాహ్నం గం. 1:55 ని.కు నర్సంపేట నుండి వయా హన్మకొండ, హైదరాబాద్, ఒంగోలు, నెల్లూరు, కాళహస్తి ద్వారా తిరుపతికి చేరుకుంటుందని, నర్సంపేట నుండి తిరుపతికి ప్రతి ప్రయాణీకులకు రూ. 1,390/- రూపాయలు ఛార్జీ అని తెలిపారు. ముందస్తుగా రిజర్వేషన్ చేయించుకున్న వారికి ఆ స్వామి వారి దర్శనం టిక్కెట్లు కూడా లభించునని తెలిపారు. ఇట్టి అవకాశాన్ని నర్సంపేట నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డీఎం విజయమాధురి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సూపరింటెండెంట్ సీతారామయ్య, ఎంఎఫ్ అమల, ఆర్టీసీ అధికారులు, సీఆర్సీ సముద్రాల రవీందర్, డీఐ తోటకూరి వెంకటేశ్వర్లు ఎస్డీఐ మహిపాల్ మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.




