Tuesday, 3 November 2026

అక్రమ కలప పట్టివేత

రూ.35 వేల విలువ గల 7సైకిళ్లు సాధీనం
బయ్యారం రూరల్‌, ఏప్రిల్‌15(జనంసాక్షి): మండలంలోని అడవుల్లో ఉన్న కలపను అక్రమంగా తరలిస్తున్న ఏడుగురిని అటవీశాఖ అధికారులు సోమవారం పట్టుకున్నారు. ఏటూరినాగారాం అటవీప్రాంతం నుండి కొందరు వ్యక్తులు ఏడు సైకిళ్లపై అడవిలో నుండి కలపను పట్టుకొస్తున్నారన్నా సమాచారం అందడంతో అటవీశాఖ అధికారులు పందిపడే గ్రామం సమీపంలో గల అటవీప్రాంతంలో వారిని పట్టుకున్నారు. వీరి వద్ద నుండి 7 సైకిళ్లను, దిమ్మెలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.35వేలు ఉంటుందని అటవీశాఖ అదికారి డిఆర్‌ఓ శ్రీనివాస్‌ తెలిపారు. అక్రమంగా కలపను తరలిస్తున్న వారిపై అటవీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్‌బీఓ రాంబాబు, ఏపీఓ నాగేశ్వర్‌రావు, డేస్‌క్యాంప్‌ వాచార్స్‌ తదితరులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *