అక్రమ గోడ నిర్మాణం తొలగించాలని కమిషనర్ కు ఫిర్యాదు
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 28 (జనం సాక్షి)
అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడను తొలగించాలని సోమవారం వరంగల్ నగర పాలక సంస్థ కమిషనర్ రిజ్వాన్ భాషకు బాధితులు, వివిధ ప్లాట్ల యజమానులు మంచాల సుధాకర్, పోచాలు, చంద్రమౌళి, కిసాన్ రావు, బిక్షపతి, సాంబయ్య, శేఖర్ తదితరులు ఫిర్యాదు చేశారు. 2002లో ఉరుసు బైపాస్ రోడ్ లోని సర్వే నంబర్ 233/ బి 1 లో గల ప్లాట్లు కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలిపారు. తమ ప్లాట్లకు సంబంధించిన 15 ఫీట్ల రోడ్డు కూడా ఉందన్నారు. అలాగే ఇక్కడ ఒక పోచమ్మ గుడి కూడా ఉందని ఫిర్యాదులో తెలిపారు. అయితే ప్లాట్లకు అడ్డంగా కొందరు ప్రహరీ నిర్మాణం చేస్తున్నారని, వారికి పర్మిషన్ కూడా లేదని పేర్కొన్నారు.దీనిని అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించి తమ ప్లాటు యజమానులకు న్యాయం చేయాలని కమిషనర్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.