సదరం స్లాట్ లను పెంచాలని కలెక్టర్ కు వినతి
వరంగల్ బ్యూరో, ఆగస్టు 28 (జనం సాక్షి)
వరంగల్ జిల్లా కలెక్టర్ గారిని ప్రజావాణి లో జిల్లా దివ్యాంగుల సంఘం వారు కలిసి దివ్యాంగుల సమస్యల పై కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.దీనిలో ఎంజీఎం లో ప్రతి నెల జరిగే దివ్యాంగుల సదరము సర్టిఫికెట్ ల గూర్చి మి సేవా లో స్లాట్ బుక్ చేసుకోవాలి.అయితె ఈ స్లాట్ బుక్ కొన్ని నిమిషాల వ్యవదిలోనే ముగుస్తుంది కావున అర్హులైన దివ్యాంగులకు స్లాట్ దొరకక చాలా ఇబ్భంధులు పడుతున్నారు.కావున ఈ నెల నుండి సదరము స్లాట్ లను పెంచాలి అని మరియు ప్రతి 6 నెలలకు ఒకసారి మండలలు లేక జిల్లా వారిగా మేగా సదరము క్యాంపు లను ఏర్పాటు చేయాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో దివ్యాంగుల రాష్ఠ్ర అధ్యక్షులు ఎండి అజీమ్ ,జిల్లా అధ్యక్ష కార్యదర్శిలు బండి చక్రపాణి,అంబటి రాజేందర్,అబ్దుల్ షబ్బీర్ ,బథిని రాజు,వంశి మొదలగు దివ్యాంగులు పాల్గొన్నారు.