హైదరాబాద్ సిటీ : అక్రమంగా నల్లా కనెక్షన్ తీ సుకున్న వారినే కాదు.. అందుకు సహకరించిన ప్లంబర్లనూ వదలమ ని వాటర్ బోర్డు హెచ్చరిస్తోంది. పైపులైన్ల నుంచి వేలాది మంది అను మతి లేకుండా నల్లా కనెక్షన్లు తీసుకోవడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. సరఫరా అవుతున్న దాంట్లో 45 శాతం వరకు లెక్కలోకి రాకపోవడంతో బోర్డు ఆదాయానికి గండి పడుతోంది. దీంతో అక్రమ నల్లా కనెక్షన్ వినియోగదారులపై క్రిమినల్ యాక్షన్‌కు శ్రీకారం చుట్టారు. గురువారం రాజేంద్రనగర్‌లోని సిక్‌చవానికి చెందిన గురుప్రీత్‌సిగ్ (ఇంటి నెంబర్ : 4-9-280 /1/ ఎ/బీ) అనే వ్యక్తిపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బోర్డు అధికారులు ఫిర్యాదు చేశారు. నేరం రుజువైతే అతడికి ఐదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించే అవకాశముంది.




