గచ్చిబౌలి: ఉచిత సోలార్ టెక్నిషియన్ శిక్షణపై ఈ నెల 7వ తేదీ నుంచి కొండాపూర్‌లోని సంస్కృతి స్కూల్ ఆడిటోరియంలో అవగాహ న సదస్సు జరగనుంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సంస్థ ఉచి తంగా ఈ శిక్షణ అందజేయనుంది. కనీసం 10వ తరగతి ఉతీర్ణులైన వారితో ఐటీఐ, డిగ్రీ, చదివిన వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అర్హులు. అవగాహన సదస్సులో పాల్గొనే నిరుద్యోగ యువ త ఈ నెల 5లోపు సంస్కృతి స్కూల్ ఆడిటోరియం, గోల్డెన్ తులిఫ్ ఎస్టేట్ కొండాపూర్‌కు దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. వివరాలకు టెలిఫోన్ నెం:7032811259లో సంప్రదించాలన్నారు.




