బెల్లంపల్లి, జూన్ 3, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను తొలగించాలని శనివారం బెల్లంపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పోచంపల్లి హరీష్ మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. బెల్లంపల్లి పట్టణంలో స్థానిక బజార్ ఏరియా ఎస్సీ కమ్యూనిటీ హాల్ నీ ఆనుకొని దేవి వైన్స్ షాప్ పక్కన అక్రమంగా కమర్షియల్ షెటర్ అక్రమంగా నిర్మాణం జరుగుతుందని, వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే తొలగించి ప్రభుత్వ భూమిని కాపాడాలని వినతి పత్రంలో వివరించారు. అంతే కాకుండా పట్టణంలో మున్సిపల్ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని వాటిపై నజర్ వేయాలని సూచించారు
అక్రమ నిర్మాణాన్ని తొలగించాలి.




