Friday, 6 November 2026

అక్రమ నిర్మాణాలను ఆడుకున్న రెవెన్యూ సిబ్బంది

అక్రమ నిర్మాణాలను ఆడుకున్న రెవెన్యూ సిబ్బంది.
ఫొటో : అడ్డుకుంటున్న రెవెన్యూ సిబ్బంది.
బెల్లంపల్లి, డిసెంబర్ 9, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణం కన్నాల, బుధకలన్ శివారుల్లో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను శుక్రవారం రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. కన్నాల శివారు 112 సర్వే నెంబర్ లో, బుధకలన్ 170 సర్వే నెంబర్ లో అక్రమ నిర్మాణాలను గుర్తించి ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా నిర్మాణలు చేపట్టవద్దని, ఒకవేళ తమ ఆదేశాలు దిక్కరిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ సిబ్బంది హెచ్చరించారు.