Friday, 6 November 2026

ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు –నియోజకవర్గ యూవజన కాంగ్రెస్ అధ్యక్షులు కె గణేష్ కుమార్

ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు –నియోజకవర్గ యూవజన కాంగ్రెస్ అధ్యక్షులు కె గణేష్ కుమార్..

హన్మకొండ బ్యూరో చీఫ్ 9 జనంసాక్షి

తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తెలంగాణ ప్రజల కల సాకారం చేసిన తల్లి శ్రీమతి
సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి ఆదేశాల మేరకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కోడిపాక గణేష్ కుమార్ ఆధ్వర్యంలో హన్మకొండ వెయ్యు స్తంభాల దేవాలయంలో మరియు దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించి KUC రోడ్డు అతిథి దివ్యంగుల ఆశ్రమంలో పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రేపల్లె రంగనాథ్ హాజరైనారు.
ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వీరగంటి సంజయ్,యువజన కాంగ్రెస్ నాయకులు అస్లాం,దాసరి సాగర్,బొర్ర దినేష్,మంద కిషోర్,అంజి,సాయి,రెవెళ్లి రాకేష్,విశ్వనాథ్,వికాస్,శివ,రంజిత్,లల్లు తదితరులు పాల్గొన్నారు.