Tuesday, 3 November 2026

అక్రమ లే అవుట్లు, నిర్మాణాలు తక్షణమే ఆపండి

హైదరాబాద్‌: అక్రమ లే అవుట్లు, అందు లో జరుగుతున్న నిర్మాణాలను తక్షణమే నిలుపుదల చేసేలా చర్యలు చేపట్టాలని హైదరాబాద్‌ పట్టణాభివృద్ధి సంస్థను హై కోర్టు ఆదేశించింది. అక్రమాలకు పాల్పడుతున్న వారికి వెంటనే నోటీసులు జారీచేయలని స్పష్టం చేసింది. అనుమతులు లేని లే అవుట్లలో ఎలాంటి నిర్మాణాలు జరగడానికి వీల్లేదని, ఇప్ప టికే నిర్మాణాలు ఉంటే వాటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్‌ గ్రామంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్న తేజశ్రీ రియల్‌ ఎస్టేట్స్‌, శ్రీనిధి రియల్‌ ఎస్టేట్స్‌, లక్ష్మీనర్సింహా బిల్డర్స్‌, రాఘవేం ద్ర, సప్తగిరి రియల్‌ ఎస్టేట్స్‌లతో పాటు హెచ్‌ఎండీఏకు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలుచేయాలని ఆదేశిస్తూ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టి స్‌ దిలీప్‌ బి.బోసాలే, జస్టిస్‌ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. నా దర్‌గుల్‌ గ్రామంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారంటూ రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎం.రాజామణి, జి.వెంకటరెడ్డిలు ఇటీవల హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలుచేశారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాస నం సోమవారం మరో మారు విచారణ చేపట్టగా ఇరు పక్షాలు వాదనలు వారి వాదనలు వినిపించారు. అక్రమ లేవుట్లపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పిటీషనర్ల తరఫు న్యాయవాదులు వాదించగా, అక్రమ లేవుట్లపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని హెచ్‌ఎండీఏ తరఫు న్యా యవాది వై.రామారావు వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం నాదర్‌గుల్‌ గ్రామంతో పాటు హె చ్‌ఎండీఏ పరిధిలో కూడా అక్రమ లేఅవుట్లలో నిర్మాణాలను తక్షణం నిలుపుదల చేసేలా చర్యలు చేపట్టాలని హెచ్‌ఎండీఏ కు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *