Wednesday, 4 November 2026

దిల్‌సుఖ్‌నగర్‌లో సైకో సూది కలకలం

మన్సూరాబాద్‌: బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి కాలుకు ఏదో గుచ్చినట్లు అనిపించటంతో.. సైకో సూది అంటూ కలకలం రేగింది. యాచారం మండలం నల్లవల్లితండాకు చెందిన స్వామినాయక్‌ ఎల్‌ఐసీలో పని చే స్తూ ప్రస్తుతం బీఎన్‌రెడ్డినగర్‌లో ఉంటున్నాడు. ఇతను సోమవారం సాయంత్రం సైఫాబాద్‌ నుంచి ఎల్‌బీనగర్‌ వైపు బస్సులో బయలుదేరాడు. దిల్‌సుఖ్‌నగర్‌ రాగానే.. మోకాలు పై భాగంలో ఏదో గుచ్చుకున్నట్లు అనిపించిం ది. కొద్దిసేపటికే దురద పుట్టడంతో సైకో సూది దాడిగా అనుమానంతో భయపడిపోయాడు. తన వెనుక నిల్చున్న వ్యక్తిపై అనుమానం వచ్చిందని, కానీ, అతను బస్సు దిగి వెళ్లిపోయాడని తెలిపాడు. సూది కన్పించలేదన్నా డు. అయితే, ఎల్‌బీనగర్‌లో బస్సు దిగిన అతను ఆరెంజ్‌ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ వైద్యులకు చూపించగా.. సూది దాడి జరిగినట్లు అనవాళ్లు కన్పించలేదని వైద్యులు తెలిపారు. అయినా, వైద్యం కొనసాగించేందుకు వై ద్యులు ప్రయత్నించగా.. తనకు హెల్త్‌ కార్డు ఉందని, దాని ఆధారంగా వైద్యం చేయించుకుంటానని అతను ఆ సుపత్రి నుంచి వెళ్లిపోయాడు. అయితే సూది దాడి జరిగిందని కచ్ఛితమైన ఆధారం లేకపోయినా సైకో సూది దాడి అంటూ కలకలం రేగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *