Thursday, 5 November 2026

అక్రమ వసూళ్లను అడ్డుకునే వారేరి

* ?

 

** వేగురుపల్లి లో గోల్ మాల్ గోవిందులు

** నిబంధనలకు నీళ్లు **

** మానేరులో మట్టి రోడ్డు

** క్వారీ గడువు ముగిసినా యధేచ్చగా అక్రమ ఇసుక రవాణా **

* కార్యదర్శికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకుడు

మానకొండూరు, ఆర్,సి,జనవరి 17 (జనం సాక్షి)

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురుపల్లి గ్రామంలో ఇసుక అక్రమ రవాణా, వసూళ్ల పర్వం యదేచ్చగా కొనసాగుతోంది. గ్రామాభివృద్ధి పేరిట వసూలు రాజాలు నిబంధనలకు నీల్లోదిలారు. అక్రమ ఇసుక రావాణా పై అడ్డగోలు వసూళ్లకు తెరలేపారు. ఈ గోల్మాల్ వ్యవహారం, గోల్మాల్ గోవిందులపై మీడియాలో వచ్చిన కథనాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ అక్రమ ఇసుక రవాణా వ్యవహారం కొనసాగుతుండడంపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి గ్రామ క్వారీ నుండి కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురుపల్లి గ్రామ క్వారీకి ఇసుకను తరలించి అక్రమార్జనకు తెర లేపారు. వేగురుపల్లి క్వారీ గడువు ముగిసినా, గట్టెపల్లి క్వారీ నుండి ఇసుకను తరలించడం దానికి మానేరులో అక్రమంగా మట్టి రోడ్డు నిర్మించడం ఇసుక మాఫియా మాయాజాలానికి ఓ మచ్చుతునక.ఒక క్వారీ గడువు ముగిసినా, మరో క్వారీ కి ఇసుకను తరలించడం నిబంధనలకు విరుద్ధం కాగా, మా గ్రామ శివారు నుండి ఇసుకను తరలిస్తున్నారనే నెపంతో లారీకి 200 రూపాయల చొప్పున రుసుం వసూలు చేయడం ఈ ఉధంతంలో మరో మలుపు. గ్రామపంచాయతీ అభివృద్ధి పేరిట రసీదులను ముద్రించి కొన్నింటి పైన తారీఖు, మరికొన్నింటిపై లారీ నంబర్ పూర్తిగా వేయకుండా, చివరి లేదా ఆఖరి నంబర్లు వేయడం,సంతకం చేయకుండా రసీదులు ఇచ్చి, తిమ్మిని బమ్మి బమ్మిని తిమ్మి ని చేసే ఘన పాటీల హస్త లాఘవంతో అడ్డగోలు వసూలు దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా గత పక్షం రోజులుగా దినదిన ప్రవర్ధమానమవుతుంది.

 

** అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునే వారెవరు… ?

పంచాయతీ, మైనింగ్, రెవెన్యూ, పోలీసు వ్యవస్థలన్నీఇసుక అక్రమ రవాణాపై మౌనం వహించడం, ఎవరి అండదండలతోఈ వ్యవహారం నిరాటకంగా కొనసాగుతోందో ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్న. ఈ వ్యవస్థలను మేనేజ్ చేసే పెద్ద తల ఎవరనీ, ఆ గాడ్ ఫాదర్ కనుసన్నల్లోనే మండల, జిల్లా, నాయకులు సైతం ఈ వ్యవహారంలో పాత్ర, సూత్రధారులేనని విమర్శలు లేకపోలేదు.

* కార్యదర్శి కి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకుడు…

 

గత పక్షం రోజులుగా ఈ వసూళ్ల వ్యవహారం కొనసాగుతున్న వైనంపై వేగురుపల్లి కాంగ్రెస్ నాయకులు జంగ భరత్ గాంధీ రెడ్డి స్పందించారు. వసూలు చేసే వ్యక్తిని సోమవారం అడ్డుకొని ఎవరు 200 రూపాయల చొప్పున వసూలు చేయమని చెప్పారని నిలదీశారు. సర్పంచ్ భర్త కనుకుంట్ల అభిలాష్ వసూలు చేయమంటే చేస్తున్నానని చెప్పడంతో ఆయన గ్రామ పంచాయతీకి చేరుకొని ఈ అక్రమ వసూళ్లపై గ్రామ పంచాయతీ కార్యదర్శి గొడిశల మౌనికను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామపంచాయతీ అభివృద్ధి కమిటీ అని ఏదీ లేదని బయటి వ్యక్తులు వసూలు చేస్తున్నారని ఆమె బదిలిచ్చారు. అలాంటి తీర్మానం కానీ, గ్రామసభ అంటూ ఏమీ జరగలేదని. అక్రమ వసూళ్లకు గ్రామ పంచాయతీకి ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు.ఈ వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చి ఉన్నతాధికారులకు నివేదించి అక్రమ వసూళ్లకు తెరదించాలని భరత్ గాంధీ రెడ్డి కార్యదర్శికి ఇచ్చిన ఫిర్యాదులో కోరారు.
◆◆◆◆. వార్డు సభ్యుల ఆగ్రహం

గ్రామంలో బావి నిర్మాణం పేరిట అక్రమ వసూలు రాజాలు రోజుకు సుమారు70 లారీలకు 200 రూపాయల చొప్పున 14 వేల రూపాయలు ఒక రోజుకు వసూలు చేసినా, దానికి గ్రామాభివృద్ధి పేరిట అని సరిపెట్టడం ఏమిటని వార్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏకపక్షంగా ఎలా వసూలు చేస్తున్నారని వార్డు సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 200 రూపాయలు వసూలు చేసిన రసీదులో సంతకం, తేదీ, లారీ,నెంబరు తదితర లోసుగులతో అక్రమంగా అదనపు ఆదాయం ఆర్జిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వసూలు చేసిన రూపాయలు పక్కదారి పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.తీర్మానం లేనిదే వసూలు చేయడం, వార్డు సభ్యులకు సమాచారం లేకపోవడం ఏమిటని వారు తీవ్ర స్థాయిలో తమ నిరసన వ్యక్తం చేశారు. అక్రమంగా ఒక క్వారీ నుండి మరొక క్వారికి ఇసుక తరలించడం లారీలకు అక్రమంగా 200 రూపాయలు చొప్పున వసూలు చేయడం దానికి గ్రామాభివృద్ధి పేరిట రసీదులు ఇవ్వడం తదితర అంశాలపై పోలీస్,రెవెన్యూ,మైనింగ్,పంచాయతీరాజ్, శాఖ అధికారులు స్పందించి, ఈ అక్రమ వసూళ్ల వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చి,వసూల దందాకు తెరవేయాలని పలువురు కోరుతున్నారు. అసలు గ్రామాభివృద్ధి పేరిట వసూలు చేసే నిబంధన అంటూ ఏది లేకున్నా, వసూలు రాజాలు నిబంధనలు తుంగలో తొక్కి వసూలు చేసిన పైకం కక్కించాలని దీనిపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని మండల కాంగ్రెస్ నాయకులు జంగ భరత్ గాంధీ రెడ్డి తెలిపారు