రామారెడ్డి జనంసాక్షి :
అనారోగ్యంతో ఒకరు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. అంతక్రియల కోసం జర్నలిస్టు సహాయం చేశారు. ఈ సందర్భంగా ఆంద్రప్రభ జర్నలిస్ట్ ఎల్లన్న మాట్లాడుతూ, రామారెడ్డి మండల కేంద్రంలోని ఉప్పల్వాయి గ్రామంలో
మంగలి రామచంద్రం ( 52 ) వృత్తిరీత్యా మంగళి పని చేసేవాడు. అతని అనారోగ్య పరిస్థితులు సరిగ్గా లేక గత వారం రోజుల నుండి నిజామాబా ద్ జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ హాస్పిటల్ నందు చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. అత నికి ఒకరు కూతురు భాగ్యలక్ష్మి తల కొరివి పెట్టడానికి సన్నద్దం అయి అంత్యక్రియలు నిర్వహించడం చూశాను. వారి ఆర్థిక సమస్యల ను, పరిస్థితిని చూసి ఇలాంటి బాధ ఎవరికి రాకూడదని ఆత్మ చల్లించిపోయి అంతక్రియల కోసం అంతిమ యాత్ర లో ఐదువేల నగదును ఆర్థిక సాయం అందజేశానని చెప్పారు. ఆయన వెంట ఆకులు లింగం, సంకి శివరాజ్, సంకి.లింగం, బాలాజీ, జీ నర్సయ్య, యాదగిరి, సాయిలు , సాకలి రాజు, తదితరులు పాల్గొన్నారు.




