హైదరాబాద్:బాలానగర్ చౌరస్తాలో అగ్ని ప్రమాదం సంభవించింది. నిన్న అర్థరాత్రి రహదారి పక్కనే ఆగి ఉన్న ఓ ప్రైవేటు బస్సులో షార్ట్‌సర్యూట్‌తో మంటలు చెలరేగాయి. అనంతరం పక్కనే ఉన్న మరో బస్సుకు వ్యాపించాయి. దీంతో రెండు బస్సులు దగ్థమయ్యాయి. మంటలు సమీపంలోని చిరువ్యాపారుల దుకాణాలకు వ్యాపించడంతో అవి కూడా కాలి బూడిదయ్యాయి. తర్వాత పక్కనే ఉన్న గ్యాస్ రిఫిల్ దుకాణానికి మంటలుఉ వ్యాపించేలోగా అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.




