Tuesday, 3 November 2026

అన్నవరంలో 400 విహహాలు

అన్నవరం : సత్యదేవుని సన్నిధి తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో రికార్డు స్థాయిలో పెళ్లిళ్లు జరిగాయి. గురువారం రాత్రి నాలుగు ముహూర్తాల్లో సుమారు 400 వివాహాలు జరిగాయి. ఇందులో పెద్దల అంగీకారంతో జరిగిన ప్రేమ పెళ్లిళ్లు కూడా ఉన్నాయి. ప్రేమికుల దినోత్సవం, మంచి ముహూర్తం రెండూ కలిసి రావడంతో ఉన్నాయి. ప్రేమికుల దినోత్సవం, మంచి ముహూర్తం రెండూ కలిసి రావడంతో మూడు ముళ్ల బంధంతో జంటలు ఒక్కటయ్యాయి. రద్దీ ఎక్కువగా ఉండటంతో మూడు ముళ్ల బంధంతో జంటలు ఒక్కటయ్యాయి. రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రాంగణమంతా పెళ్లి బృందాలతో కిక్కిసరిసిపోయింది. ఎక్కడ చూసినా కొత్త దంపతులు దర్శనమిచ్చారు. వసతి గదుల దొరక్కపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శుక్రవారం కూడా చాలా పెళ్లిళ్లు ఉన్నాయని ఆలయ అధికారులు తలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *