అగ్రహారం డిగ్రీ కాలేజ్ మార్చొద్దంటూ విద్యార్థి సంఘాల ఆందోళన
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అధికారులకు వినతి. రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 22. (జనంసాక్షి). అగ్రహారం డిగ్రీ కాలేజీని మరో చోటికి మార్చొద్దంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నాయకులు మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ జేఎన్టీయూ కోసం డిగ్రీ కళాశాలను మార్చాలనుకోవడం సరికాదని అన్నారు. యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అధికారులకు వినతి పత్రం అందజేశారు. నిరసన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు మల్లారం ప్రశాంత్, వేణు, రాకేష్, భీమ్ ఆర్మీ నాయకులు దుబ్బల ప్రవీణ్ కుమార్. ఏఐఎస్ఎఫ్ నాయకులు అంగూరి రంజిత్, కెవిపిఎస్ నాయకులు ఎర్రవల్లి నాగరాజు, ఏబీవీపీ నాయకులు రంజిత్, అగ్రహారం డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.