అగ్రికెం’ సంస్థ వారంలో మూసివేయాలని కలెక్టర్ ఆదేశాలు
శ్రీకాకులం : ఎచ్చెర్ల మండలంలోని నాగార్జున అగ్రికెం పరిశ్రమను వారం రోజుల్లోగా సురక్షితంగా మూసివేయాలని శ్రీకాకులం జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఉదయం పరిశ్రమలో భారీ పేలుడు జరిగి 18 మంది కార్మికులు గాయపడిన సంగతి తెలిసిందే.