శ్రామికులను విస్మరిస్తున్న ప్రభుత్వాలు
న్యూఢిల్లీ,జూన్22(జనం సాక్షి ): సామాజిక న్యాయం అంటే సమాజంలో అట్టడుగున ఉన్న దళితులు, ఆదివాసీలు, బడుగు బలహీనవర్గాలవారు ఇతర కులాలతో పాటు సమానంగా అభివృద్ది కావడం.అంటరానితనం, కుల వివక్ష అంతం కావాలి. బలహీనులపై దాడులు చేసిన మోతుబరులతో రాజీ కుదిర్చే అధికార యంత్రాంగం తీరు మారి, ‘చట్టం తన పని తాను చేసుకునేలా’ రూపొందడం విధానాల మార్పు ద్వారానే సాధ్యం. ఇటీవల నీతి అయోగ్ విడుదల చేసిన రాష్ట్రాల ర్యాంకింగ్ నివేదిక ప్రకారం దళితులపై నేరాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ఏడవ స్థానంలో, ఆరోగ్య ఇండెక్స్‌లో ఎనిమిదో స్థానంలో, మహిళలపై నేరాల్లో దేశంలో తొమ్మిదో స్థానంలోనూ వుండగా, ప్రాథమిక విద్యలో పదిహేడవ ర్యాంకులో వుంది. గిరిజనులు కేంద్రీకరించివున్న 30 మండలాల్లో సగం ఆవాసాలకు కనీసం రోడ్డు కూడా లేదని రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు ఘోషిస్తున్నాయి. మహిళపై నేరాలు నానాటికీ పెచ్చరిల్లుతున్నాయి. మొదటి స్థానంలోవున్న గుంటూరు జిల్లాలో 2017 సెప్టెంబర్‌లో 124 కేసులు నమోదుకాగా ఆరు మాసాల్లో అంటే 2018 మార్చిలో 179కి పెరిగాయి. దళిత, గిరిజన, వెనుకబడిన తరగతులు, మహిళలు, మైనార్టీ తరగతుల సమస్యల పరిష్కారానికి రాయితీలు కల్పించడం మాత్రమే పరిష్కారం కాదు. శ్రామికులకు, ఆరుగాలం కష్టపడ్డ అన్నదాతలకు శ్రమకు తగిన ప్రతిఫలం దక్కడంలేదు. వారి కష్ట ఫలితం వారికి దక్కితేనే జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. అదే విధంగా కార్మికులకు కనీసవేతనం 18 వేలు చెల్లించడంతోపాటు, కార్మిక చట్టాలను పటిష్టపర్చడం అవసరం.అప్పుడో ఇప్పుడో నష్ట పరిహారం లేదా సబ్సిడీ ఇవ్వడం కాకుండా పంట పండించడానికి చేసిన ఖర్చుకు 50 శాతం అదనంగా ధర రైతుకు చెల్లించేలా చట్టం చేయాలి. కౌలురైతులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపట్ల ప్రత్యామ్నాయ కార్యక్రమం స్పష్టమైన డిమాండ్లు రూపొందించింది. యువ ఉద్యోగులు, ఉపాధ్యాయుల మెడ విూద కత్తిలా వేలాడుతున్న సిపిఎస్ విధానాన్ని తెచ్చింది వాజ్‌పారు ప్రభుత్వమే. మన్మోహన్ సింగ్‌తోపాటు రాజశేఖరరెడ్డి, కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వాలు దాన్ని యధాతథంగా అమలు చేశాయి. సిపిఎస్ రద్దు చేస్తామని 2014లో హావిూనిచ్చిన చంద్రబాబు ఆ ఊసే ఎత్తలేదు. పెట్టుబడిదారీ విధానాన్ని అమలు చేస్తున్న ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర పాలక పార్టీలు ఖజానాను సంపన్నులకు దోచిపెట్టడమేగాక అవినీతిని పెంచి పోషిస్తున్నాయి. ప్రపంచబ్యాంకు ఆదేశిత సంస్కరణలు, జలయజ్ఞం వగైరా అవినీతి అందరికీ తెలిసిందే! అవినీతి రహితంగా ప్రభుత్వ పాలన, పారదర్శకంగా నిర్ణయాలు, పంచాయతీలకు మున్సిపాలిటీలకు నిధులు వంటి అంశాలను ప్రత్యామ్నాయ కార్యక్రమం పేర్కొంది. రాజకీయ అవినీతిని అంతం చేయడం ప్రత్యామ్నాయ శక్తులకే సాధ్యం. ఎన్నికల సంస్కరణలు, ప్రధానంగా దామాషా ఎన్నికల విధానం నేటి అవసరం. మౌలికమైన భూమి సమస్య మొదలు విశ్వ వ్యాపితమైన పర్యావరణ అంశం వరకు అనేక విషయాలపై ప్రత్యామ్నాయ కార్యక్రమం పూర్తిగా సామాన్య పజల కోర్కెలను ప్రతిబింబించేదిగా వుంది. సంపన్నుల కొమ్ముకాసే చర్యలవల్ల కొద్దిమందికోటీశ్వరులవుతున్నారు. కాబట్టి ఈ విధానాలకు ప్రత్యామ్నాయం రావాలి. అది ప్రత్యామ్నాయ రాజకీయ విధానాల ద్వారానే సాధ్యం.




