Wednesday, 4 November 2026

అట్టహాసంగా ప్రారంభమైన సీఎం కప్ క్రీడా పోటీలు

 

 

 

 

 

 

 

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేటి నుండి 24 వరకు నిర్వహించే మంచిర్యాల జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు క్యాతన్ పల్లి మున్సిపాలిటీ, మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియంలో సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్, జిల్లా జెడ్పి చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మందమర్రి జిఎం మోహన్ రెడ్డిలు సంయుక్తంగా జ్యోతి ప్రజ్వలన చేసి అట్టహాసంగా ప్రారంభించారు. సీఎం కప్ క్రీడా పతాకాన్ని జిల్లా జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, డీఎస్ఏ క్రీడా పతాకాన్ని జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ ఆవిష్కరించారు. అనంతరం మంచిర్యాల జిల్లా లోని వివిధ మండలాల నుండి వచ్చిన క్రీడాకారులు క్రవందనంలో పాల్గొన్నారు. క్రీడాజ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, బెల్లంపల్లి ఎమ్మెల్యే, జిల్లా జడ్పీ చైర్ పర్సన్ లు మాట్లాడుతూ మండలాలలో గెలుపొందిన క్రీడాకారులకు అభినందనలు తెలుపుతూ, జిల్లా స్థాయిలో రాణించి క్రీడలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని, రాష్ట్రస్థాయిలో మంచిర్యాల జిల్లాకు పేరు తీసుకురావాలని కోరారు. గెలుపు ఓటములు సహజమని, ఓడిపోయిన వారు నిరుత్సాహపడకుండా రాబోయే క్రీడలలో గెలుపు కోసం కృషి చేయాలని పేర్కొన్నారు. క్రీడలను క్రీడాస్ఫూర్తితో ఆడి ఎలాంటి గాయాలు చేసుకోకుండా ఆడాలని తెలిపారు. వాలీబాల్ పోటీలను జిల్లా కలెక్టర్ భగవత్ సంతోష్ సర్వీస్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, క్యాతన్ పల్లి మునిసిపల్ వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి, డివై ఏస్ ఓ శ్రీకాంత్ రెడ్డి, మంచిర్యాల జిల్లా కబడ్డీ సెక్రెటరీ రామచందర్, శ్రీరాంపూర్ ఏరియా స్పోర్ట్స్ సూపర్వైజర్ అశోక్, మందమర్రి ఏరియా స్పోర్ట్స్ సూపర్వైజర్ చిన్నయ్య , బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, ఇన్చార్జ్ గాండ్ల సమ్మయ్య, కౌన్సిలర్లు, మందమర్రి సిఐ మహేందర్రెడ్డి, రామకృష్ణాపూర్ ఎస్సై బి అశోక్, పీఈటీలు అధికారులు, క్రీడాభిమానులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.