జనం సాక్షి,మిర్యాలగూడ.భారత రాష్ట్ర సమితి ప్రభుత్వo దేవాలయాల అభివృద్ధికి ప్రాధాన్యత నిస్తుందని స్థానిక శాసనసభలు నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. సోమవారం మిర్యాలగూడ మండల పరిధిలోని లావుడి తండా, ముల్కల కాల్వ గ్రామాలలో శ్రీశ్రీశ్రీ లింగ బసవేశ్వర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి వారి నూతన ఆలయ విగ్రహ శిఖర నూతన ఏకశిల ధ్వజస్తంభ మహోత్సవ కార్యక్రమంలో, ముల్కల్ కాల్వలోని శ్రీ గంగమ్మ తల్లి జాతర కార్యక్రమాలలో రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ తిప్పనవిజయ సింహారెడ్డి, ఎం బి ఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ లతో కలిసి పాల్గొని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక జరుపుకునే ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుందని పేర్కొన్నారు. ఆలయాలలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు, తిప్పన విజయసింహారెడ్డి, నలుమూత సిద్ధార్థ లను సత్కరించారు. ఈ కార్యక్రమాలలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ధనవత్ చిట్టిబాబు నాయక్, నాయకులు ఆంగోతు హతీరం నాయక్, ధీరావత్ రవితేజ, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పులి జగదీష్, ఏ సి ఎస్ చైర్మన్ వెలిశెట్టి రామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, మండల రైతు బంధు సమితి అధ్యక్షులు గడగజ ఏడుకొండలు, సర్పంచ్ బోగబోయిన రాజు, మాలవత్ రవీందర్ నాయక్, సాయన్న, బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి ఎం డి షోయేబ్, లావుడి శ్రీహరి, కామిశెట్టి శ్రీనివాస్, చిమట యాదగిరి, చింతల వెంకటేశ్వర్లు, మాజీ ఎంపిటిసి రవి, చిన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు.




