Wednesday, 4 November 2026

అత్యంత వైభవోపీతముగా శ్రీ స్వామివారి కల్యాణ మహోత్సవం

 

 

 

 

 

 

హుజూర్ నగర్ ఏప్రిల్ 7 (జనం సాక్షి): మండలంలోని బూరుగడ్డ గ్రామంలో శ్రీశాల్మలి కంద ఆదివరాహ లక్ష్మీనృసింహ వేణుగోపాల స్వామి దేవస్థానం నందు రాత్రి నిత్య హోమ కార్యక్రమాలు ముగిసిన తదుపరి స్వామివారి ఎదుర్కోల మహోత్సవం జరుపుకొని కళ్యాణ వేదిక నందు అత్యంత జన సందోహం మధ్య శ్రీ వేణుగోపాల స్వామి, రుక్మిణి సత్యభామ సమేతముగా స్వామివారి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవోపీతముగా జరిగింది. ఈ కార్యక్రమం యజ్ఞచార్యులు ముడుంబై పవన్ కుమారా చార్యులు చే జరుపబడినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి సతీమణి రజిత, జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, గ్రామ సర్పంచ్ షేక్ సలీమారంజాన్ స్వామివారిని దర్శించుకున్నారు. గోపాలపురం గ్రామ సర్పంచ్ శాసనాల నాగసైదులు, ఎంపీటీసీ చీకూరి రాజారావు స్వామివారికి వార్షికంగా పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, సమర్పించినారు. మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం తరుపున వార్షికంగా పట్టు వస్త్రాలు, సమర్పించినారు. అలాగే మంత్రి ప్రగడ వెంకటేశ్వరరావు దంపతులు, దేష్ముఖ్ అరుణకుమార్ దంపతులు శ్రీస్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, సమర్పించినారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎంపీ లక్ష్మణరావు, ఆలయ చైర్మన్ గండు సైదులు, ధర్మకర్తల మండలి సభ్యులు బండ్ల పవన్ కుమార్, ఆకుల గురవయ్య, గువ్వల రామకృష్ణ, ప్రార్థనబోయిన మట్టపల్లి, సురభి కుశేలు, నందిగామ అంజమ్మ, ముడుంబై శ్రీనివాసచార్యులు, సింగరాచార్యులు, శేషాచార్యులు, అనంత చార్యులు, సప్తగిరి చార్యులు, మధుసూదనాచార్యులు, ఆలయ అర్చకులు మనోహరాచార్యులు, హరీష్ కుమరా చార్యులు, మాడుగుల, ఆలయ సిబ్బంది యరగాని కిరణ్ గౌడ్, g.గోవిందరెడ్డి, y.రమేష్, y.ఉపేందర్, భక్తులు పాల్గొన్నారు.