Wednesday, 4 November 2026

ఆత్మీయ సమ్మేళనంలో ఆత్మీయతను పంచుకున్న మండల బీఆర్ ఎస్ నాయకులు

 

 

 

 

 

 

 

 

రుద్రుర్ (జనంసాక్షి): రుద్రుర్ మండలం  రాయకుర్  గ్రామంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి  ముఖ్య అతిథిగా హాజరయ్యారు  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  బిఆర్ ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు పార్టీ శ్రేణుల్లో నయా జోష్ నింపుతున్నాయని  బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన  ప్రతీసంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ ప్రతి  కార్యకర్త ప్రధాన పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు, కులాలు,మతాల మధ్య చిచ్చు రగిల్చేందుకు ప్రయత్నాలు చేసేందుకు కొందరు వస్తారని వారిని నమ్మవద్దని కోరారు. శ్రుతి మించుతున్న ప్రతిపక్షలా దుర్మార్గాలను బీఆర్ఎస్ శ్రేణులు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు ఉన్న శక్తి సామర్ధ్యాలు ప్రత్యర్థులకు ఏ మాత్రం లేవని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదెండ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దశ, దిశ, నిర్దేశం చేశారు. బీఆర్ఎస్ దేశానికే  రోల్ మాడల్ గా నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరెక్కడా అమలుకావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సభాపతి మరియు వారి ధర్మపత్ని ,  వారి తనయుడు పోచారం సురేందర్ రెడ్డి,  ఎంపీపీ అక్కపల్లి సుజాత నాగేందర్, జడ్పీటీసీ నారోజి గంగారాం, మండల అధ్యక్షుడుపత్తి లక్ష్మణ్, నత్కరి సాయిలు, సంగయ్య, వెంకటేశ్వర దేశాయ్, పత్తి సావిత్రి, పత్తిరాము, మండల నాయకులు , ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ లు, వార్డు మెంబెర్లు, మండల మహిళ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు