Tuesday, 3 November 2026

అత్యవసర సమయంలో రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్..

అత్యవసర సమయంలో రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్…

నిర్మల్ మండలం తల్వేద గ్రామానికి చెందిన ఎల్శెట్టి నారాయణ నిన్న రోడ్డు ప్రమాదం గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.. వెన్నెముకకు తీవ్రగాయం కావడంతో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నాడు.. వైద్యులు చికిత్స నిమిత్తం ఐదు యూనిట్ల రక్తం అవసరం అని తెలపడంతో పేషెంట్ బి నెగిటివ్ కావడంతో రక్తం సేకరించడంలో ఇబ్బంది కలిగింది… నిర్మల్ జిల్లా ఎస్పీ బీ నెగటివ్ అని తెలియడంతో ఫోన్లో సంప్రదించగా ఎస్పీ గారు స్పందించి తనతో పాటు మరో ఇద్దరు సిబ్బందితో నిర్మల్ జిల్లా ఆస్పత్రికి వచ్చి రక్తదానం చేశారు… నిత్యం విధులలో బిజీగా ఉండే ఎస్పీ గారు స్పందించి బ్లడ్ డొనేట్ చేయడంతో బాధిత కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు..