అత్యాధునిక వైద్య సదుపాయాలతో డయాగ్నొస్టిక్, స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయం
– ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
హుజూర్ నగర్ నవంబర్ 7 (జనం సాక్షి): హుజూర్ నగర్ ప్రాంత ప్రజలకు డయాగ్నస్టిక్, స్కానింగ్ సేవలు అందించడం అభినందనీయమని హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని సాయిబాబా థియేటర్ రోడ్ మేఘన హాస్పిటల్ పక్కన అయ్యప్ప కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన సన్ షైన్ డయాగ్నస్టిక్ అండ్ స్కానింగ్ సెంటర్ ను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, నిమ్మల శ్రీనివాస్ గౌడ్ సూర్యాపేట జిల్లా గ్రంధాలయ చైర్మన్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు హుజూర్నగర్ ప్రాంత ప్రజలు ఇలాంటి స్కానింగ్, డయాగ్నస్టిక్ సెంటర్లు లేక ఇతర దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని కానీ ఇప్పుడు హుజూర్నగర్ లో కూడా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. అత్యాధునిక వైద్య పరికరాలతో ఏర్పాటుచేసిన క్లినిక్ తో సరైన వైద్యం అందించి ప్రజలను కాపాడాలన్నారు. అన్ని రకాల వైద్యశాలలతో పట్టణ అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రభుత్వం విద్యా, వైద్యం పారిశ్రామిక అభివృద్ధి రంగాలకు ప్రోత్సహిస్తుందన్నారు. హుజూర్ నగర్ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. ఈ సందర్భంగా క్లీనిక్ యాజమాన్యం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చన, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరావు, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, కుంట సైదులు, సోమగాని ప్రదీప్, కౌన్సిలర్లు, నాయకులు, క్లినిక్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.
అత్యాధునిక వైద్య సదుపాయాలతో డయాగ్నొస్టిక్, స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయం




