పరిశుభ్రతే ఆరోగ్యానికి తొలిమెట్టు
పరిశుభ్రత గ్రామ ప్రజలందరి బాధ్యత
జహీరాబాద్ నవంబర్ 7 (జనం సాక్షి)
ఈరోజు జాహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలం గంగ్వార్ గ్రామంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాజాత బృందం ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పాటల ద్వారా అవగాహన కల్పించారు. పరిశుభ్రత లోపం తోనే ప్రజలు అనారోగ్యానికి కారణమయ్యి ఆరోగ్య మరియు ఆర్థికంగా నష్టపోతున్నారని గ్రామస్థులకు పాటల ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హాజరైన గ్రామ పంచాయతీ సెక్రెటరీ సి హెచ్ రేఖ మాట్లాడుతూ పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, చదువు యొక్క ప్రాముఖ్యత, నాటిన మొక్కలను సంరక్షించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కొరినారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జయశ్రీ నిరంజన్ రెడ్డి, పంచాయతికార్యాలయం సిబ్బంది, గ్రామ పెద్దలు అలాగే సాంస్కృతిక సారథి కళాకారులు ఆయిదాల సునీల్, నీరుడి దుర్గేష్, డప్పు రమేష్, పటేల్ సంధ్య, బి నవీన్, నరిగె స్వప్న, సంబరబోయిన మల్లేష్, మ్యాక రాజు, ఏర్పుల వినేశ్ పాల్గొన్నారు.
పరిశుభ్రతే ఆరోగ్యానికి తొలిమెట్టు




