కాంగ్రెస్ అభిమానుల నాయకుల మధ్య అదరహో,,,జిల్లా వ్యాప్తంగా భువనగిరి కి తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు అభిమానులుజన్మదిన వేడుకలు రానున్న ఎన్నికల సమరానికి సిద్ధంభువనగిరి టౌన్ జనం సాక్షి:–
యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు భువనగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు భువనగిరి పట్టణంలోని శ్రీ సాయి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో కార్యకర్తలు అభిమానుల మధ్య ఘనంగా జరిగాయి యాదాద్రి జిల్లా వ్యాప్తంగా వందలాది మంది కాంగ్రెస్ శ్రేణులు ఈ వేడుకలకు తరలివచ్చారు వేదిక పైన భారీ కేకులు తీసుకువచ్చి కట్ చేయించి కార్యకర్తలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అభిమానుల ఆనందోత్సవాల మధ్య కుంభం తడిసి ముద్దయ్యారు దాదాపు ఐదు గంటల పాటు అభిమానులు కార్యకర్తలు ఆయనను పూలమాలలు వేసి శాలువలు కప్పి గజమాలతో సత్కరించి మెమొంటోలు బహూకరించి తమ అభిమాన నాయకుని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి ముందు ఆయన ధర్మపత్ని జ్యోతి రెడ్డి కూతురు స్ఫూర్తి రెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి కుమారుడు శ్రీరామ్ రెడ్డిలతో కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాయగిరి మెయిన్ రోడ్డు కమాన్ వద్ద సహృదయ వృద్ధాశ్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు చల్లగురుగుల రఘుబాబు ఆధ్వర్యంలో డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి బర్త్ డే సందర్భంగా ఆయనని ఘనంగా ఆహ్వానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆశ్రమంలో అనాధలకు వృద్ధులకు పండ్లు బెడ్లు పంపిణీ చేసి అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భువనగిరి పట్టణానికి చేరుకుని కిసాన్ నగర్ లోని దర్గాలో సమాధిపై దట్టికప్పి ప్రార్థనలు జరిపారు అక్కడినుండి పచ్చలకట్ట సోమేశ్వరాలయం చేరుకుని ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా నిర్వహించారు హైదరాబాద్ చౌరస్తా నుండి కార్యకర్తలు అభిమానులు ఊరేగింపుగా డప్పు సబ్బులతో వేల వాయిద్యాలతో సమావేశ ఫంక్షన్ హాల్ కు తీసుకురాగా అక్కడ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ముందుగా స్టేజ్ మీదికి కుంభం అనిల్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు ఘనంగా ఆహ్వానించి కుటుంబ సభ్యులతో కేక్ కట్ చేశారుకార్యకర్తలసభ వేదికపైకి చేరుకోగానే కార్యకర్తలు నాయకులు సన్మానించడానికి పోటీ పడడంతో తోపులాట జరిగింది బౌన్సర్లు రంగంలోకి దిగి అనిల్ కుమార్ రెడ్డికి అడ్డంగా నిలబడి కంట్రోల్ చేసిన కార్యకర్తలు తోసుకోరావడంతో తోపులాట జరిగింది కొంత కొంత సమయం అనంతరం జన్మదిన వేడుకలు ప్రశాంతంగా జరిగాయి అభిమానులు ఆయనకు గజమాలలు టోపీలు అందజేసి ఖడ్గాలను బహూకరించారు రాష్ట్రాన్ని దోచుకు తింటూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ప్రజా వ్యతిరేక కెసిఆర్ ప్రజల రక్తాన్ని పీల్చే సైతాన్ కెసిఆర్ తుగ్లక్ పాలన ప్రభుత్వాన్ని ఈ ఖడ్గంతో తుది ముట్టించి రానున్న ఎన్నికల్లో రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరుతూ కార్యకర్తలు అనిల్ కుమార్ రెడ్డికి ఖడ్గం బహూకరించారు అసెంబ్లీ ఎన్నికలు మరో సంవత్సరం లోపల జరిగే నున్న నేపథ్యంలో ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చేయడానికి జన్మదిన వేడుకలు వేదికగా మారిందని కార్యకర్త భావిస్తున్నారు ప్రస్తుతం భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అనుకూల పవనాలు ఉన్న నేపథ్యంలో ఇదే ఊపు జోరు ను తగ్గకుండా ఎన్నికల వరకు కార్యకర్తలను ఒక తాటిపై తీసుకువచ్చి జోష్ తో ఎన్నికలను ఎదుర్కొన్నట్లయితే భువనగిరి కిలా మీద కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని కార్యకర్తలు ఆనందంతో బీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల నాయకులు జెడ్పిటిసిలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచులు కౌన్సిలర్లు పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు




