Wednesday, 4 November 2026

ఆలయ నిర్మాణానికి వెంకన్న గౌడ్ విరాళం

 

 

 

 

 

 

మోత్కూరు ఫిబ్రవరి 9 జనంసాక్షి : మున్సిపాలిటీ పరిధిలోని కొండపురం గ్రామంలో నూతనంగా నిర్మితమవుతున్న హనుమాన్ ఆలయ నిర్మాణానికి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కారుపోతుల వెంకన్నగౌడ్ – కీర్తి దంపతులు రూ.40 వేల నగదును ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు బుధవారం అందజేశారు. తాము అందించిన నగదును ఆలయంలోని మార్బుల్స్ టైల్స్ కు వినియోగించాలని ఆలయ నిర్వాహకులను కోరారు. ఆలయ నిర్మాణానికి అడిగిన వెంటనే తమ వంతు సహాయం అందించిన వెంకన్న, కీర్తి దంపతులను గ్రామస్తులు ఆలయ కమిటీ నిర్వాహకులు అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బీసు రవి, నీల వెంకటేష్, బాలగాని శ్రీనివాస్, బీసు శ్రీనివాస్, మన్నె నరసింహ, మన్నె వెంకటేష్, బీసు మంగమ్మ, బీసు రాము, ప్రకాష్, మన్నే తదితరులు పాల్గొన్నారు.