Wednesday, 4 November 2026

అదిలాబాద్: అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

రామకృష్ణాపూర్‌: శ్రీరాంపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అరుణక్కనగర్‌ ఎదురుగా ఉన్న నర్సరీలో అనుమానాస్పదస్థితిలో ఇదే నగర్‌కు చెందిన అత్తెం లింగయ్య (35)అనే యువకుడు మృతి చెందాడు. ఈనెల 6న లక్ష్మి తన కుమారుడు లింగయ్య ఫిర్యాదు అదృశ్యమయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్‌ కేసుగా నమోదు చేశారు. కాగా లింగయ్య మృతి చెందడంపై తల్లి లక్ష్మి అనుమానం ఉందని ఫిర్యాదు చేసినట్లు అదనపు ఎస్సై మసూద్‌ తెలిపారు. లింగయ్య భార్య స్వరూపతో తరుచూ గొడవలు జరగడంతో గత కొద్ది రోజులుగా తల్లిగారింట్లో ఉంటుందన్నది. ఇదే క్రమంలో గత రోల 30 తేదీన ఇంట్లో నుంచి వెళ్లిన కుమారుడు శవమై కనిపించడంతో తల్లి రోధించింది. మృతుడికి కూతురు, కుమారుడు ఉన్నారు. సంఘటన స్థలాన్ని మంచిర్యాల ఏఎస్పీ విజయ్‌కుమార్‌, శ్రీరాంపూర్‌ సీఐ వేణు చందర్‌లు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *