Wednesday, 4 November 2026

అదిలాబాద్: సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి

చెన్నూరు రూరల్‌ : వచ్చే నెల 2న తలపెట్టిన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సంకే రవి కోరారు. ఆదివారం పట్టణంలోని న్యూలయోల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న తీరును ఆయన ఎండగట్టారు. కార్మికుల పట్ల ప్రభుత్వాలు చిత్తశుద్ధి వహించడం లేదని ఆయన ధ్వజమెత్తారు. సెప్టెంబర్‌ 2న చేపట్టే దేశ వ్యాప్త సమ్మెను అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు క్రిష్ణమాచారి, తోట సత్యనారాయణ, సుమతి, అంగన్‌వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *