Tuesday, 3 November 2026

అది ఆత్మహత్య కాదు.. హత్యే: శశికుమార్ భార్య

హైదరాబాద్‌: ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో నిన్న హిమాయత్‌ నగర్‌లో జరిగిన కాల్పుల ఘటన గంట గంటకూ ఉత్కంఠ రేపుతోంది. నిన్న డాక్టర్‌ ఉదయ్‌ కుమార్‌పై కాల్పుల ఘటనలో నిందితుడిగా భావిస్తున్న శశికుమార్‌ మృతదేహాన్ని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం నక్కలపల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి వైద్యుడు శశికుమార్‌ భార్య కాంతిమంగళవారం మీడియాకు లేఖ రాశారు. తన భర్తను వైద్యులు ఉదయ్‌, సాయికుమార్‌లు నిన్నే హత్యచేసి కాల్పుల నాటకం ఆడారని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *