Thursday, 5 November 2026

అదుపుతప్పి ఇద్దరు యువకులు మృతి

నిజామాబాద్: లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన బోధన్ బస్టాండ్ సమీపంలో జరిగింది. సోమవారం మధ్యాహ్నం వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి లారీ చక్రాల కింద పడటంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు మరణించారు.

నిజామాబాద్ నుంచి అరసవల్లి వెళ్తున్న లారీని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *