Thursday, 5 November 2026

న్యాయవాది ఇంట్లో భారీ చోరీ

వైఎస్సార్ జిల్లా: దసరా పండగకు బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో భారీ చోరీకి గురైన ఘటన వైఎస్సార్ కడప జిల్లా కేంద్రంలోని ఓం శాంతినగర్‌లో చోటుచేసుకుంది.

కాలనీకి చెందిన న్యాయవాది శివగామిని దసరా పండుగకు బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఉంది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రాథమిక విచారణ చేసి ఏడు తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు నిర్ధరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *