*అదుపుతప్పి కారు బోల్తా యువకునికి తీవ్ర గాయాలు..
-దాతల కోసం వేచి చూస్తున్నా నిరుపేద కుటుంబం.*భూపతిపూర్ గ్రామ ప్రజలు యువత ప్రజాప్రతినిధులు
జనం సాక్షి జూలై 31 రాయికల్ మండల్…. రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన కొమ్ము రోహిత్ అనే యువకుడు హైదరాబాద్ నుండి తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తాపడడంతో రోహిత్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. మెదడులో రక్తస్రావం కావడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు మెదడు శస్త్ర చికిత్స నిమిత్తం అధికమొత్తంలో ఉండడంతో, వైద్య ఖర్చులు భరించలేని నిరుపేద కుటుంబం కావడంతో దాతల సహకారం కోసమై వేచి చూస్తున్నారు. దాతలు ముందుకు వచ్చి ఒక నిండు ప్రాణాన్ని కాపాడాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. దాతలు ఈ నంబర్ కు ఫోన్ పే లేదా గూగుల్ పే 9014707814 చేయాలని కోరుతున్నారు.