జనంసాక్షి హైదరాబాద్: మూవీ మొఘల్ డాక్టర్ డి.రామానాయుడి పార్థివ దేహానికి ప్రభుత్వ, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. పూర్తి సంప్రదాయ బద్దంగా జరిగిన ఈ కార్యక్రమానికి సినీ దిగ్గజాలతోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. రామానాయుడు స్టూడియోకి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. రామానాయుడికి ఆయన కుటుంబ సభ్యులు తుది వీడ్కోలు పలికారు. రామానాయుడి పెద్ద కుమారుడు సురేష్‌బాబు ఆయన చితికి నిప్పటించారు.




