Thursday, 5 November 2026

మణిపూర్‌లో బాంబు పేలుడు: ఏడుగురుకి గాయాలు

హైదరాబాద్‌: బాంబు పేలుడు సంభవించి ఏడుగురు గాయాలపాలైన సంఘటన మణిపూర్‌లో చోటుచేసుకుంది. మణిపూర్‌ మార్కెట్‌లో బాంబు పెట్టారంటూ వచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొన్నారు. అక్కడ వారికి ఒక సంచిలో బాంబులు కనిపించాయి. దీంతో ఒక కానిస్టేబుల్‌ ఆ బాంబులను నిర్వీర్యం చేసేందుకు సమీపంలోని నదిలో పడవేస్తుండగా అవి ఒక్కసారిగా పేలాయి. ఈ ప్రమాదంలో నలుగురు పోలీసులు సహా మొత్తం ఏడుగురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *