Thursday, 5 November 2026

చంద్రమోహన్‌కు గుండెపోటు: ఆరోగ్యంగానే ఉన్నారు.. 2 రోజుల్లో డిశ్చార్జ్

 

ప్రముఖ సినీనటుడు చంద్రమోహన్‌ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. రామానాయుడు అంత్యక్రియలు పూర్తయిన కొద్దిసేపటికే చంద్రమోహన్ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారన్న వార్తలతో టాలీవుడ్ షాక్ అయ్యింది. 
చంద్రమోహన్‌కు గుండెపోటు రావడంతో ఆయనను హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో చేర్చి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కాగా, ఆయనకు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. 1966 నుంచి ఇప్పటివరకు ఆయన వరుసగా అనేక చిత్రాల్లో నటించారు.

కాగా చంద్రమోహన్ ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన మేనల్లుడు ప్రకటించారు. రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని, ఎవ్వరూ ఆందోళనపడాల్సిన అవసరం లేదని చంద్రమోహన్ మేనల్లుడు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *