Wednesday, 4 November 2026

అధికార పార్టీ ఆకర్షలో టిడిపి చిక్కుకోనుందా?

హైదరాబాద్ : తెలంగాణలో అధికార పార్టీ స్పీడ్ పెంచుతోంది. ప్రతిపక్షం టార్గెట్‌గానే అడుగులు వేస్తోంది. ముఖ్యంగా టీడీపీని టార్గెట్ చేసిన గులాబీ లీడర్లు ఆపరేషన్ ఆకర్ష్‌ పరంపరను కొనసాగిస్తున్నారు. పాలమూరులో చంద్రబాబు పర్యటనను సీరియస్‌గా తీసుకున్న టీఆర్ఎస్‌ నేతలు… ఆదిలోనే సైకిల్ జోరును నిలువరించాలని వ్యూహ రచన చేస్తున్నారు. చంద్రబాబు పాలమూరు జిల్లాలో పర్యటించడంపై టీఆర్ఎస్ నేతలు మండి పడుతున్నారు. రాబోయే రోజుల్లో ఆపరేషన్ ఆకర్ష్‌ మరింత తీవ్రంగా ఉంటుందని తమ్ముళ్లను హెచ్చరిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలను తమ గూటికి చేర్చుకుంటామని గులాబీ దండు టిడిపి కి హెచ్చరిక సంకేతాలను పంపుతోంది.
కారెక్కనున్న తెలుగు తమ్ముళ్లు..
ఇప్పటికే ఇబ్రహీంపట్నం టిడిపి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గులాబీ గూటికి చేరటం ఖాయమైంది. ప్లీనరీలో ఆయన టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోనున్నారు. మరికొందరు తెలుగు తమ్ముళ్లు కారెక్కేందుకు సిద్ధంగా ఉన్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు అధికార పార్టీపై సైకిల్ పార్టీ లీడర్లు మాటల తూటాలు పేల్చుతున్నారు. టీఆర్ఎస్ నేతలవి గాలివాటం మాటలంటూ టీడీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. అలాగే టీడీపీని తెలంగాణలో విస్తరించేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు చెబుతున్నారు. మే 24 నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజా సమస్యలపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీ-టీడీపీ నిర్ణయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *