అధిక పోషకాలు ఉన్న ఆహారాలే తీసుకోవాలి సూపర్వైజర్ మంజుల
జనం సాక్షి, చెన్నరావు పేట
మార్చ్ 21 నుండి ఏప్రిల్ 3 వరకు అంగన్వాడిలలో జరుగుతున్న పోషణ పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా చెన్నారావుపేట మండలం ఎల్లాయగూడెం ప్రైమరీ స్కూల్లో అంగన్వాడి సూపర్వైజర్ మంజుల ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలతో పాటు తల్లిదండ్రులకు హ్యాండ్ వాష్ తో పాటు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అన్నప్రాసన అక్షరాభ్యాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమన్ని ఉద్దేశించి సూపర్వైజర్ మంజుల మాట్లాడుతూ ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండా భోజనానికి ముందు తర్వాత సబ్బుతో గాని డెటాల్ తో గాని చేతుల శుభ్రపరచుకొవాలని అదేవిధంగా కిషోర బాలికలు, మహిళలకు అధిక పోషక విలువలు కలిగిన మీలెట్స్ గురించి వివరిస్తూ సరైన పోషణ విలువలు కలిగినటువంటి రాగులు,సజ్జలు,జొన్నలు, కొర్రలు,సామెలు ఇలాంటి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని సమపాలలో తీసుకోవాలని వివరించారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం రమేష్, ఏఎన్ఎం కవిత, అంగన్వాడీ టీచర్లు ఉమ, రమా మంజుల, రాణి, స్వరూప, సచిదేవి పాల్గొన్నారు.
అధిక పోషకాలు ఉన్న ఆహారాలే తీసుకోవాలి




