గద్వాల నడిగడ్డ, మే 16 (జనం సాక్షి);బీజేవైయం రాష్ట్ర శాఖ ఆదేశానుసారం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణమ్మ సూచన మేరకు మంగళ వారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీస్ నందు జోగులంబా గద్వాల జిల్లా బీజేవైయం అధ్యక్షులు మిర్జాపూర్ వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రయివేట్, కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని,అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సంవత్సరం మొదలుకాగానే విద్యార్ధులకి సమయానికి పుస్తకాలూ యూనిఫామ్ ,నాణ్యమైన భోజనం అందచేయాలని జోగులంబా గద్వాల జిల్లా కలెక్టర్ వల్లురు క్రాంతి కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం బీజేవైయం అధ్యక్షులు మిర్జాపూర్ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్ అధిక ఫీజులు చెల్లించలేక మధ్య తరగతి తల్లిదండ్రులు చితికిపోతున్నారాని,ఫీజులను నియంత్రిచాల్సిన ప్రభుత్వం ఈ భాద్యతను విస్మరిస్తోందాని,తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని ఈ ప్రభుత్వాని డిమాండ్ చేస్తూ… బిజైవైయం రాజీలేని పోరాటం చేస్తుందాని, ఇప్పటికైనా ఈ కెసిఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం కళ్లు తెరిచి రాష్ట్రంలో విద్యాహక్కు చట్టాన్ని అమలు చేసి ఫీజుల నియంత్రణ చేయాలని లేకపోతే బిజెపి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో బీజేవైయం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెమలి కంటి రామాంజనేయులు, బీజేవైయం జిల్లా ప్రధానకార్యదర్శి గోసాయి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.




