నర్సి0హులపేట మే 16 (జనం సాక్షి)గ్రామీణ యువతలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయాలనే ఉద్దేశంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం స్థానిక జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల ఆవరణలో మండల స్థాయి సీఎం కప్ క్రీడోత్సవాలను ఎంపీపీ టేకుల సుశీల యాదగిరి రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడడమే కాకుండా యువత శారీరకంగా మానసికంగా దృఢంగా తయారై ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి తోడ్పడుతాయని తెలిపారు.అనంతరం మండలంలోని వివిధ గ్రామాల నుండి విచ్చేసిన కబడ్డీ,ఖొఖో, వాలీబాల్ క్రీడాకారులను ఎంపీపీ,సర్పంచ్ ఎమ్మార్వో,ఎస్సై, ఎంఈఓ, జట్లుగా విభజించి పోటీలను నిర్వహించారు.కబడ్డీ బాలుర విభాగంలో సర్పంచ్ జట్టు ప్రథమ బహుమతి,ఎంపీపీ జట్టు ద్వితీయ బహుమతి సాధించగా,వాలీబాల్ బాలికల విభాగంలో ఎంఈఓ జట్టు ప్రథమ బహుమతి,ఎంపీపీ జట్టు ద్వితీయ బహుమతి సాధించగా,ఖొఖో బాలుర విభాగంలో ఎస్సై జట్టు ప్రథమ బహుమతి,ఎమ్మార్వో జట్టు ద్వితీయ బహుమతి సాధించింది. అథ్లెటిక్స్ 100 మీటర్లు 400 మీటర్ల పరుగు పందెంలో 60 మంది క్రీడాకారులు పాల్గొనగా 100 మీటర్ల పరుగు పందెం విభాగంలో బి పవన్ ప్రథమ బహుమతి,జి పండు ద్వితీయ బహుమతి, 400 విభాగం పరుగుపందెంలో జి పండు ప్రథమ బహుమతి జి మహేష్ ద్వితీయ బహుమతి గెలుపొందడం జరిగింది. కాగా వివిధ క్రీడా విభాగాలలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా స్థాయికి ఎంపిక చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ వేముల రజిత రామ్ రెడ్డి,వైస్ ఎంపీపీ దేవేందర్,సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మెరుగు శంకర్ గుడ్, మందుల యాకన్న తహసిల్దార్ వివేకం, ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి, ఎంపీఓ సోమ్లాల్,ఎస్సై మంగీలాల్,
కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి తోట సురేష్, ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత ,వ్యాయామ
ఉపాధ్యాయులు వీరారెడ్డి, పద్మావతి,రేణుక, భద్రయ్య,వరప్రసాదం, జానకి రామ్, ప్రజా ప్రతినిధు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.




