Tuesday, 3 November 2026

అధైర్యపడవద్దు అండగా ఉంటాం మృతురాలి మనవడు అభిలాష్ ను చదివిస్తా.

అధైర్యపడవద్దు అండగా ఉంటాం
మృతురాలి మనవడు అభిలాష్ ను చదివిస్తా..
నిరుపేద కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూజల హరికృష్ణ భరోసా.
(జనం సాక్షి)04, సిద్దిపేట జిల్లా
అధైర్యపడవద్దు అండగా ఉంటామని రాష్ట్ర పీసీసీ ప్రధాన కార్యదర్శి పూజల హరికృష్ణ చాకలి రామవ్వ కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. సిద్దిపేట రూరల్ మండలం పుల్లురు గ్రామ నివాసి చాకలి చింత కుంట రమవ్వ 60 సంవత్సరములు పొలం పనులకు వేల్లేటప్పుడు మార్గ మధ్యలో పాము కాటువేయడంతో రోడ్డు మీద పడి పోగా అక్కడ ఉన్నా ప్రజలు చికిత్స నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తిసుకేల్లాగా హాస్పిటల్లో డాక్టర్స్ ప్రథమ చికిత్స చేస్తుండగా చాకలి రమవ్వ మరణించడం విషయం తన సహచరుల ద్వారా విషయం తెలుసుకున్న రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి పూజల హరికృష్ణ పరామర్శించి ఓదార్చాడు కుటుంబాన్నికి 50కేజీల బియ్యం నగదు రూపాయలు ఇచ్చి మృతురాలి మనమడు అభిలాష్ ను విద్యాసంస్థలో ఉచితంగా చదివించి భవిష్యత్తులో అన్ని విధాలుగా ఆదుకుంటానని పూజల హరికృష్ణ భరోసా ఇచ్చారు. ఆ కుటుంబానికి ఉండడానికి ఇల్లు కూడా లేక పోవడం తో కలెక్టర్ దృష్టికి తీసికెళ్ళి ప్రభుత్వం నుండి అన్ని విధాలుగా ఆదుకునేలా చర్యలు తీసుకుంటా అని హామీ ఇచ్చారు అలాగే కుటుంబానికి అండగా నేను ఉన్నాను అనే బరోసా కల్పించాడు ఈ సందర్భంగా మాట్లాడుతు పాము కాటుకు బలైపోయింది రామవ్వ ఈ మరణం చాలా బాధాకరం అని అన్నారు. వారి కుటుంబం కు అండగా నిలబడ్డ పూజల హరికృష్ణ కి పుల్లుర్ గ్రామ ప్రజలు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు కనకయ్య మండల & జిల్లా నాయకుడు రాష్ట్ర ఫిషర్మెన్ కన్వీనర్ బాబేష్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ బండి శివకుమార్,ఎస్సీ సెల్ రూరల్ మండల అధ్యక్షులు కోదాడి రమేష్, నారాయణరావు పెట మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు బింగి యాదగిరి, ఓగ్గు యాదగిరి మామిడిపల్లి యాదగిరి, మామిడిపల్లి పోశయ,చింతకుంట చంద్రయ్య, గంగాధరి యాదగిరి తది తరులు పాల్గొన్నారు.