విజయవంతమైన పెనుబల్లి మండల టిఎల్ఎం మేళా
పెనుబల్లి, జనవరి 3(జనం సాక్షి)
పెనుబల్లి మండల పరిధి లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు తయారుచేసిన బోధనోపకరణాల ప్రదర్శన మంగళవారం జడ్పీహెచ్ఎస్ వి ఎం బంజర్ ఆవరణలో విజయవంతం గా నిర్వహించడం జరిగిం దని ఉపాధ్యాయులు వి.రామారావు తెలిపారు,
ఈ కార్యక్రమాన్ని ఎంపీపీ శ్రీమతి లక్కినేని అలేఖ్య , జెడ్పిటిసి చెక్కిలాల మోహన్ రావు,సత్తుపల్లి రూరల్ సీఐ. హనో క్ , ప్రదర్శన హాళ్లను ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమా లలు వేసి నివాళులర్పిం చారు.
అనంతరం ఎంఈఓ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎం పి పి అలేఖ్య,ఎం పి డి ఒ మహాలక్ష్మి, తహసీల్దార్ రమాదేవి ఎం ఈ ఒ సి హెచ్.వెంకటేశ్వరరావు, నోడల్ అధికారి ఎం. శ్రీనివాసరెడ్డి, పాల్గొనగా ఈ సంధర్భంగా ఎం పి పి మాట్లాడుతూ ఉపాధ్యాయు లు రూపొందించిన బోధనోపకరణాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని అన్నారు. అతిథులు అందరూ ఉపాధ్యాయుల కృషిని కొనియాడారు.
ప్రదర్శనయందు తెలుగు, ఆంగ్లము, గణితము , పరిసరాల విజ్ఞానం నకు సంబంధించిన బోధనోపకరణాలను ప్రదర్శించినారు. వాటి నుండి ప్రతి అంశము నుంచి 5 చొప్పున మొత్తం 20 బోధనోపకరణాలను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసినారు. ఎంఈఓ , సీఎంఓ రాజశేఖర్ చే జిల్లా స్థాయికి ఎంపిక కాబడిన ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలనుఅందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 150 మంది ఉపాధ్యాయులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఇవ్వటం జరిగింది.
ఈ కార్యక్రమమునకు భోజనములు ఏర్పాటు చేసిన బి .ప్రసాద్ రెడ్డి కి ఉపాధ్యాయులందరూ కృతజ్ఞతలు తెలియజేశారు.
కాంప్లెక్స్ హెచ్ఎంలు బి. నరసింహారావు, పి.రమేష్, జి. శ్రీనివాసరావు, ఎం నరసింహారావు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, జడ్పీహెచ్ఎస్ విఎం బంజర పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో టి ఎల్ ఎం మేళా విజయవంతమైనట్లుగా ఎంఈఓ తెలిపారని ఉపాధ్యాయు లు తెలియజేశారు.




